'బింబిసార' ఓటీటీ విడుదలపై ఆసక్తికర అప్డేట్

Makers clarity on bimbisara movie OTT release. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ సినిమా 'బింబిసార'. ఇటీవలే రిలీజ్‌ అయిన ఈ మూవీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.

By అంజి  Published on  9 Aug 2022 12:22 PM IST
బింబిసార ఓటీటీ విడుదలపై ఆసక్తికర అప్డేట్

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ సినిమా 'బింబిసార'. ఇటీవలే రిలీజ్‌ అయిన ఈ మూవీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఫస్ట్‌ రోజు నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌కు దగ్గర పడింది. తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు కళ కళలాడుతున్నాయి. సంయుక్త మీనన్‌, కేథరిన్‌ థెస్రా హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్డ్‌ట్‌ ఇచ్చారు. 'బింబిసార' ఓటీటీలోకి ఇప్పుడే రాదని చెప్పారు. కనీసం సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత గాని ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాదని స్పష్టం చేశారు.

'బింబిసార' చిత్రయూనిట్‌కు ప్రముఖ నిర్మాత్‌ దిల్‌రాజు సక్సెస్‌ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా దిల్‌ రాజ్‌ మాట్లాడారు. 'ఎఫ్‌-3' సినిమాను 50 రోజుల పాటు థియేటర్లలో ఆడించిన తర్వాతే ఓటీటీలో రిలీజ్‌ చేశామని చెప్పారు. ఇప్పుడు 'బింబిసార' సినిమాను కూడా 50 రోజుల తర్వాత విడుదల చేయాలని సినిమా మేకర్స్‌కు విజ్ఞప్తి చేశారు. 'బింబిసార' నిర్మాతల్లో ఒకరైన హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఈ సినిమా అంత త్వరగా ఓటీటీలోకి రాదని స్పష్టం చేశారు. ఇది థియేటర్లలో ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని, కనీసం 50 రోజులు పూర్తి కానిదే ఓటీటీలో రిలీజ్‌ కాదని తెలిపారు. ప్రస్తుతం 'బింబిసార' థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది. దీంతో ఓటీటీలవైపు మేకర్స్ మొగ్గు చూపించకుండా తాము వేసుకున్న ప్లాన్‌ ప్రకారం థియేటర్లలోనే ఆడించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు చింతరామన్ భట్ పాటలు అందించగా.. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తూ నటించారు. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వరినా హుస్సేన్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Next Story