బాలీవుడ్ కు షాకిచ్చిన ఆడియన్స్.. నిర్మాతల గగ్గోలు

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు ఈద్ స్పెషల్ గా విడుదల అవుతూ ఉంటాయి. చాలా క్లాసిక్ హిట్స్ ఈద్ స్పెషల్ గా విడుదలై భారీ కెలెక్షన్స్ ను సాధించాయి

By Medi Samrat  Published on  12 April 2024 3:30 PM GMT
బాలీవుడ్ కు షాకిచ్చిన ఆడియన్స్.. నిర్మాతల గగ్గోలు

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు ఈద్ స్పెషల్ గా విడుదల అవుతూ ఉంటాయి. చాలా క్లాసిక్ హిట్స్ ఈద్ స్పెషల్ గా విడుదలై భారీ కెలెక్షన్స్ ను సాధించాయి. అయితే ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలు విడుదలైనా.. ప్రేక్షకుల నుండి కనీసం రెస్పాన్స్ ను అందుకోలేకపోయాయి. ఈద్ బాలీవుడ్ సినిమాల విడుదలలకు మంచి సందర్భం. గత దశాబ్దంలో, అనేక బాలీవుడ్ చిత్రాలు ఈ సెలవుదినాన్ని లక్ష్యంగా చేసుకుని బ్లాక్ బస్టర్‌లు సాధించాయి. ఈ ఈద్.. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ నుండి రెండు సినిమాలు వచ్చాయి. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్.. అజయ్ దేవగన్ 'మైదాన్‌' సినిమాలు థియేటర్లకు వచ్చాయి. అయితే ఈ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

అజయ్ దేవగన్ నటించిన మైదాన్ ఏప్రిల్ 10 న ప్రీమియర్ చేశారు. సినిమాకు మంచి రివ్యూలు కూడా వచ్చాయి. తొలిరోజు ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టలేదు. మొదటి రోజున దాదాపు 5 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ప్రీమియర్లతో సహా భారతదేశంలో దాదాపు 7.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్లు అని అంటున్నారు. ఆ బడ్జెట్‌కి ఇది నిజంగా దారుణమైన ఓపెనింగ్స్. బడే మియాన్ చోటే మియాన్ సినిమా విషయంలో కూడా అదే విధంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల కంటే ఎక్కువ అని అంటున్నారు.. ప్రారంభ రోజు భారతదేశంలో 15 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. బడే మియాన్ చోటే మియాన్, మైదాన్ రెండూ నిర్మాతలకు పీడకలను మిగులుస్తూ ఉన్నాయి.

Next Story