వ‌కీల్ సాబ్ చూసిన మహేష్.. ప‌వ‌న్ న‌ట‌న గురించి ఏమ‌న్నాడంటే..

Mahesh Praises Pawan Performance. తాజాగా వ‌కీల్ సాబ్‌పై.. సూపర్ స్టార్ మహేష్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు.

By Medi Samrat  Published on  11 April 2021 3:42 AM GMT
Mahesh babu watch Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత న‌టించిన‌‌ చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా రిలీజై మాంచి టాక్‌తో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతుంది. అలాగే ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు అందుకోంటోంది. తాజాగా వ‌కీల్ సాబ్‌పై.. సూపర్ స్టార్ మహేష్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

పవన్ న‌ట‌న‌.. పై వ‌రుస‌లో ఉంటుంద‌ని.. వ‌కీల్ సాబ్‌గా.. పవన్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ ఫ్యాక్ న‌ట‌న అదిరిపోయింద‌న్నారు. చాలా మాంచి పున‌రాగ‌మ‌నం అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. అలాగే.. ప్రకాష్ రాజ్ లాయర్ పాత్రలో బ్రిలియంట్ గా నటించారని మెచ్చుకున్నారు.

ఇక‌ నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ నటన మనసుకు హత్తుకుంది. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అంటూ మొత్తం చిత్రం కాస్ట్ అండ్ క్రూ కి సోషల్ మీడియా వేదికగా ప్రిన్స్ మహేష్ బాబు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై ఇరువురి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.
Next Story
Share it