బుర్రిపాలెంకు మరోసారి అండగా మహేష్ బాబు
Mahesh Helps To Burripalem Village. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు.
By Medi Samrat Published on 17 May 2021 1:18 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఎంతో మంది చిన్నారుల హార్ట్ ఆపరేషన్లు కూడా మహేష్ బాబు నిర్వహించారు. ఆ సంఖ్య 1000కి పైగానే ఉంది. మరో వైపు మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామానికి ఎంతో సేవ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! తాజాగా బుర్రిపాలెం గ్రామ ప్రజలకు మహేష్ మరోసారి అండగా నిలిచారు. అక్కడి వారికి వైద్య సౌకర్యాలతో పాటు కరోనా వ్యాక్సిన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై మహేశ్ బాబు అక్కడి స్థానిక అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించే బాధ్యతను తీసుకున్నారు మహేష్ బాబు.
మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నారు. కీర్తీ సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై 'ఎస్ఎస్ఎమ్‌బీ28' వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. మహేష్ బాబు ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరో వైపు సేవా కార్యక్రమాల్లో కూడా తనదైన ప్రత్యేకతను చూపిస్తూ ఉన్నారు.