సినిమా చచ్చిపోయింది..మహేశ్, రాజమౌళి ఏఐ ఫైట్‌పై ఆర్జీవీ పోస్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది.
By - Knakam Karthik |
సినిమా చచ్చిపోయింది..మహేశ్, రాజమౌళి ఏఐ ఫైట్‌పై ఆర్జీవీ పోస్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి బాహాబాహీ తలపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) షేర్ చేసిన ఈ ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్. మహేశ్ బాబు, రాజమౌళి ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని గొడవ పడుతుంటే.. అది చూసిన వారు "ఇది నిజమేనా?" అని భ్రమపడేంత సహజంగా ఉంది. ఈ వీడియోపై వర్మ స్పందిస్తూ.. "సినిమా ఈజ్ డెడ్" అంటూ తన మార్క్ కామెంట్ చేశారు. అంటే, భవిష్యత్తులో నటీనటులు, లొకేషన్లతో పనిలేకుండా కేవలం ఏఐతోనే సినిమాలు తీసే రోజులు వచ్చేస్తున్నాయని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో రాజమౌళి, మహేష్ బాబు శారీరకంగా గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది. చాలా మంది వీక్షకులు మొదట్లో ఆ ఫుటేజ్ నిజమని నమ్మినప్పటికీ, అది AI- జనరేటెడ్ డీప్‌ఫేక్ అని నిర్ధారించబడింది. ఇటీవలి రోజుల్లో, మ్యాట్రిక్స్-టైప్ యాక్షన్ బ్లాక్‌లను ప్రతిబింబించే ఇలాంటి నకిలీ వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.
CINEMA IS DEAD https://t.co/JUPhPHPTDz
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2026
‘వారణాసి’ సిద్ధమవుతోంది!
ఈ ఏఐ వీడియోలు ఎలా ఉన్నా, నిజ జీవితంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అగ్ర నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. నిజమైన సినిమా పవర్‌ను చూపించడానికి రాజమౌళి సిద్ధమవుతుంటే, ఏఐ మాత్రం తన విన్యాసాలతో అభిమానులకు వినోదాన్ని అందిస్తోంది.