మహేష్ సినిమాకి రూ.80 కోట్లు..!

Mahesh Babu, Trivikram Srinivas’s SSMB28 digital rights acquired by Netflix for Rs 81 crores. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ - స్టార్ హీరో మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా అప్ డేట్స్

By Sumanth Varma k  Published on  3 Feb 2023 9:09 AM GMT
మహేష్ సినిమాకి రూ.80 కోట్లు..!

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ - స్టార్ హీరో మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా అప్ డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా మహేష్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ భారీగా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే, ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి భారీ గిరాకీ తగిలింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం రూ.80 కోట్లు ఇచ్చి సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త అటు నార్త్ లోనూ, ఇటు సౌత్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో మహేష్ కి మేనత్త పాత్ర ఒకటి ఉంది. కథ ప్రకారం ఈ పాత్ర చాలా కీలకం. పైగా ఈ పాత్రలో బరువైన ఎమోషన్స్ ఉండబోతున్నాయి. అందుకే.. ఈ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారు. రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ బాబు పాత్రలో కొత్త కోణం కూడా ఉంటుందని.. తెలుగు సినిమా నేటివిటీకి ఫ్రెష్ టోన్ ను ఈ చిత్రం అందించబోతుందని తెలుస్తోంది.

ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా 'అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయ్యింది.

Next Story