సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతూ మహేష్ ట్వీట్

Mahesh Babu thanks to CM Jagan.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తూ ప్ర‌భుత్వం కొత్త జీవోను జారీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2022 9:43 AM GMT
సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతూ మహేష్ ట్వీట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తూ ప్ర‌భుత్వం కొత్త జీవోను జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఒక్కో ప్రాంతంలో థియేట‌ర్‌లను నాలుగు కేట‌గిరీలుగా విభ‌జించింది. క‌నిష్టంగా రూ.20, గ‌రిష్టంగా రూ.250గా నిర్థయించింది. పెద్ద సినిమాల‌కు ఐదో ఆట‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి వంటి వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కి, పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఏపీ సీఎం జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము చెప్పిన సమస్యలను విని, వాటి గురించి ఆలోచించి ఆ సమస్యలకి పరిష్కారంగా సినిమా టికెట్ రేట్లని సవరించి కొత్త జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు. మున్ముందు ప్రభుత్వానికి, టాలీవుడ్ మధ్య మంచి సపోర్ట్, అండర్ స్టాండింగ్ ఉండాలని కోరుకుంటున్నాను. మంత్రి నానిగారికి కూడా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

Next Story
Share it