అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొట్టేస్తున్న 'మురారి 4K'

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు.

By అంజి  Published on  4 Aug 2024 9:45 PM IST
Mahesh Babu, Murari, 4K movie, Tollywood

అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొట్టేస్తున్న 'మురారి 4K'

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మహేష్ బాబు 29 సినిమా రాజమౌళితో చేస్తూ ఉండగా.. ఆ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వస్తుందో లేదో తెలియకపోయినా కూడా.. మహేష్ బాబు అభిమానులు మురారి సినిమాతో ఎంజాయ్ చేయాలని మాత్రం ఫిక్స్ అయిపోయారు.

కృష్ణ వంశీ క్లాసిక్ సినిమా మురారి (2001) 4K వెర్షన్ తెలుగు రాష్ట్రాల అంతటా రీ-రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే, మురారి బుకింగ్స్ రూపంలో 65 లక్షల రూపాయలను రికార్డ్ మార్క్ దాటేసింది. పెద్ద సంఖ్యలో థియేటర్లు/సింగిల్ స్క్రీన్‌లు ఇంకా ఆన్‌లైన్‌లో తమ బుకింగ్‌లను తెరవలేదు. రాబోయే రోజుల్లో ఇంకొన్ని థియేటర్లు కూడా యాడ్ అవ్వనున్నాయి. చూస్తుంటే తెలుగులో మరో రీరిలీజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వనుంది. ఈ చిత్రంలో సోనాలి బింద్రే కథానాయికగా నటించగా, మణిశర్మ స్వరాలు అందించారు.

Next Story