మాస్‌ లుక్‌తో అదరగొట్టిన మహేష్‌బాబు

ఈ రోజు సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన 'మోసగాళ్లకు మోసగాడు' మూవీని రీ రిలీజ్‌ చేశారు.

By అంజి  Published on  31 May 2023 5:14 AM GMT
Mahesh Babu, Krishna Jayanti, Tollywood

మాస్‌ లుక్‌తో అదరగొట్టిన మహేష్‌బాబు

ఈ రోజు సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన 'మోసగాళ్లకు మోసగాడు' మూవీని రీ రిలీజ్‌ చేశాడు. అది కూడా 4కే అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీతో. దీంతో ఘట్టమనేని అభిమానులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీ రిలీజ్‌లో కూడా ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. ప్రతి ఏటా కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన మహేష్‌ బాబు.. ఎదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా మహేష్‌ అదే ట్రెండ్‌ని ఫాలో అయ్యారు.

కృష్ణ జయంత్రి సందర్భంగా.. తన లేటెస్ట్‌ మూవీ నుంచి ఓ మాస్‌ లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇవాళ చాలా స్పెషల్ రోజు. ఇది మీ కోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు. పోస్టర్‌లో మహేష్‌ చుట్టు రౌడీలు రౌండప్‌ చేసి ఉన్నారు. ఇక మహేష్‌ వారిని ఓ పట్టు పట్టడానికి సిద్ధమవుతున్నట్లు కనిపించాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది మహేష్‌ కెరీర్‌ పరంగా 28వ సినిమా. హారిక హాసిని నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇక మహేశ్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో మహేష్‌ అభిమానులందరిలో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

Next Story