అందుకే మ‌హేష్ 'పుష్ప‌'ను వ‌ద్ద‌నుకున్నాడా..?

దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 చిత్రం ప్రస్తుతం దేశ, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

By Kalasani Durgapraveen  Published on  9 Dec 2024 11:03 AM IST
అందుకే మ‌హేష్ పుష్ప‌ను వ‌ద్ద‌నుకున్నాడా..?

దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 చిత్రం ప్రస్తుతం దేశ, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వసూళ్ల పరంగా చూస్తే ఈ యాక్షన్ థ్రిల్లర్-డ్రామా చిత్రం రికార్డులు కొల్ల‌గొడుతుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 చిత్రం కథ, పాత్రలు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే పుష్ప కోసం మేకర్స్ మొదటి ఎంపిక అల్లు అర్జున్ కాదని మీకు తెలుసా. అతని కంటే ముందు సౌత్ సినిమాకి చెందిన ఈ వెటరన్ స్టార్ కిడ్‌కి పుష్పరాజ్ పాత్రను ఆఫర్ చేశారు. ఆ సూపర్‌స్టార్‌ ఎవరో, సినిమా ఆఫర్‌ని ఎందుకు తిరస్కరించాడో తెలుసుకుందాం.

3 సంవత్సరాల క్రితం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ప్రారంభమైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా స్క్రీన్‌ప్లే కూడా సుకుమార్‌ రాశారు. ఈ సినిమా తీయబోతున్నప్పుడు స్టార్ కాస్ట్‌ని ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది, ఎందుకంటే పుష్ప యాంటీ హీరో సినిమా కాబట్టి పెద్ద సూపర్‌స్టార్‌ని సంప్రదించడం కష్టమైంది.

IMDB రిపోర్ట్ ప్రకారం.. సుకుమార్ మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుకి పుష్ప ఆఫర్ చేసాడట‌.. అయితే ఆయ‌న యాంటీ హీరో చిత్రం కారణంగా తిరస్కరించాడు. ఈ విధంగా ఈ పాత్ర అల్లు అర్జున్ వద్దకు వెళ్లి, అతడు పుష్పరాజ్గా మారి చరిత్ర సృష్టించాడు.

డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ వీకెండ్ తర్వాత ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.530 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఇది మాత్రమే కాదు, పుష్ప-ది రూల్ ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల రూపాయల మార్కును దాటింది.

పుష్ప 2లో ఇన్‌స్పెక్టర్ భన్వర్ సింగ్ షెకావత్ నెగిటివ్ రోల్‌లో ఫహద్ ఫాసిల్ తనదైన ముద్ర వేశారు. అయితే ఈ పాత్రను మొదట సూపర్ స్టార్ విజయ్ సేతుపతిని ఎంపిక చేశార‌ట‌. కానీ కొన్ని కారణాల వల్ల మేకర్స్ అతనితో తీయ‌లేదు. అయితే, ఫహద్ తన శక్తివంతమైన నటనతో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను చిరస్థాయిగా నిలిపాడు. అతని పాత్రను ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు.

Next Story