హైదరాబాద్: సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హీరో మహేష్ బాబు స్పందించారు. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దాడి విషాదకరమన్నారు. చిన్నారి హత్యాచారంపై మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయోయో గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సమాజంలో మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ప్రశ్నగానే మిగిలిపోతోందని మహేష్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో ఆ కుటుంబం ఎంతటి దుఃఖంలో ఉందో ఊహించడం కష్టమేనన్నారు.
సైదాబాద్ బాలిక హత్యచార ఘటన నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు అందిస్తామని రివార్డ్ కూడా ప్రకటించారు పోలీసులు. నిందితుడి కోసం 10 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది నిందితుడిని గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. నిందితుడు మద్యం మత్తులో బస్టాండ్లలలో నిద్రపోయే అవకాశం ఉందని సజ్జనార్ అన్నారు. నిందితుడిని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.