మీలాంటి మరో ఉన్నతమైన వ్యక్తి లేరు నాన్న : మ‌హేష్ బాబు

Mahesh Babu birthday wishes to his father Krishna.సూపర్ స్టార్ మహేశ్ బాబుకి త‌న తండ్రి కృష్ణ అంటే ఎంతో ప్రేమ, అభిమానం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2022 1:15 PM IST
మీలాంటి మరో ఉన్నతమైన వ్యక్తి లేరు నాన్న : మ‌హేష్ బాబు

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి త‌న తండ్రి కృష్ణ అంటే ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న తండ్రి గురించి ఆయన మాట్లాడుంటారు. కాగా.. నేడు సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఇక మ‌హేశ్ బాబు కూడా కృష్ణ‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 'హ్యాపీ బర్త్ డే నాన్నా.. ఈ ప్రపంచంలో నిజంగా మీలాంటి మరో ఉన్నతమైన వ్యక్తి లేరు. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ళు వర్ధిల్లాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ.. 'అని ట్వీట్ చేశారు మహేశ్.

ఇక సినిమాల విషయానికి వ‌స్తే 'సర్కారువారి పాట' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న మహేశ్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో యూరోప్ వెకేషన్ లో ఉన్నాడు. త్వ‌ర‌లోనే ఆయ‌న త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టించ‌నున్నాడు.

Next Story