నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ 'మ‌హేష్ అండ్ గ్యాంగ్ డిన్నర్'

Mahesh And Gang Dinner. సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ‌ర్‌పెక్ట్ ఫ్యామీలీ మెన్‌.

By Medi Samrat  Published on  12 Nov 2020 4:12 AM GMT
నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ మ‌హేష్ అండ్ గ్యాంగ్ డిన్నర్

సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ‌ర్‌పెక్ట్ ఫ్యామీలీ మెన్‌. కాస్తా ఖాళీ సమయం దొరికినా కుటుంబంతో గ‌డ‌ప‌డానికే ప్రాధాన్య‌త‌నిస్తాడు. ముఖ్యంగా పిల్లలు గౌతమ్, సితారలతో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతూ.. వీలు చిక్కినప్పుడల్లా వారితో విదేశీ టూర్ల‌కు వెళుతుంటాడు. ఇక‌ ప్రస్తుతం మహేష్‌కు సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు.అందుకు సంబంధించిన ఫొటోలను మహేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా టూర్‌కు సంబంధించి మ‌హేష్‌, అత‌ని త‌న‌య సితార‌ ఫోటోల‌ను షేర్ చేశారు. ఓ రెస్టారెంట్‌లో మ‌హేష్, సితార, గౌతమ్‌లు కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోను.. 'మా గ్యాంగ్‌తో డిన్నర్' అని మ‌హేష్ షేర్ చేశాడు. అలాగే సితార కూడా తండ్రి, అన్నయ్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ వారితో ఎంజాయ్ చేస్తున్న‌ట్లు పేర్కొంది.ఇదిలావుంటే.. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం గీత‌గోవిందం ఫేమ్‌ ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తీ సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. త‌మ‌న్ సంగీతానందిస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాను జీఎంబి, 14రీల్స్‌, మైత్రి మూవీస్ మేక‌ర్ నిర్మిస్తున్నారు.


Next Story