నితిన్ 'రా రా రెడ్డి' సాంగ్ ప్రోమో రిలీజ్.. మాములుగా లేదుగా

Macharla niyojakavargam movie Ra Ra Reddy promo out now. టాలీవుడ్ హీరో నితిన్ హిట్‌, ఫ్లాఫ్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో సినీ అభిమానులను అలరిస్తుంటాడు.

By అంజి  Published on  8 July 2022 12:49 PM IST
నితిన్ రా రా రెడ్డి సాంగ్ ప్రోమో రిలీజ్.. మాములుగా లేదుగా

టాలీవుడ్ హీరో నితిన్ హిట్‌, ఫ్లాఫ్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో సినీ అభిమానులను అలరిస్తుంటాడు. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ఎంటర్టైన్ చేశాడు. వాటిలో 'రంగ్‌దే' మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోగా.. 'చెక్' ఫ్లాఫ్ అయ్యింది. ఇక ఓటీటీలో రిలీజైన 'మ్యాస్ట్రో' మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది. నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఈ మూవీకి ప్రముఖ ఎడిటర్ ఎంఎస్‌.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌ ఇప్పటి వరకు నటించిన సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉండబోతోంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్‌, పోస్టర్స్‌లు సినీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది.

తాజాగా ఈ మూవీ నుంచి 'రా రా రెడ్డి' సాంగ్‌ ప్రోమోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. 'రా రా రెడ్డి' అంటూ సాగే ప్రోమో తెగ ఆకట్టుకుంటోంది. నితిన్, అంజలి మాస్ బీట్‌ స్టెప్పులు, మహతి స్వర సాగర్ టూన్ ఊపునిస్తోంది. ఈ సాంగ్‌ జాతరలో జరిగే ఫైట్ ముందు వచ్చే పాటలా ప్రోమోలో తెలుస్తోంది. శనివారం సాయంత్రం 5 గంటలకు ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మూవీలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నితిన్ కనిపించనున్నాడు. క్యాథెరిన్ థెరిస్సా, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి ఆదిత్యా మూవీస్‌ అండ్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌, శ్రేష్ట మూవీస్ బ్యానర్లపై ఈ మూవీని నిర్మిస్తున్నారు.


Next Story