'మా' ఎన్నికలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Maa elections Pawan Kalyan casts his vote.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉదయం
By తోట వంశీ కుమార్ Published on 10 Oct 2021 11:08 AM ISTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నాం 2 గంటల వరకు కొనసాగనుంది. ఓటు వేసేందుకు సినితారలు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సినీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, మంచు లక్ష్మీ, మోహన్ బాబు సుమ లతో పాటు పలువురు నటీనటులు ఓటు వేశారు.
ఓటు వేసిన అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ చీలిపోతుందనే ప్రశ్నే లేదని పవన్ చెప్పారు. తిప్పి కొడితే 900 ఓట్లు ఉన్నాయి. ఇందుకోసం వ్యక్తిగత దూషణలు అవసరమా అని ప్రశ్నించారు. గతంలో మా ఎన్నికల్లో ఎప్పుడూ ఇలాంటి పోటీని చూడదలేదన్నారు. ఇక మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్న ప్రచారం జరుగుతుందన్నదానిపై పవన్ స్పందించారు. అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు స్నేహితులని తెలిపారు. సినిమా వాళ్లు ఆదర్శంగా ఉండాలని సూచించారు. తాను ఎవరికి మద్దుతుగా నిలిచానో చెప్పడం ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని పవన్ చెప్పారు.
10.30 గంటల వరకు ఎంత మంది ఓటు వేశారంటే..?
ఉదయం 10.30 వరకు 240 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 925 మంది మా సభ్యులు ఉండగా.. అందులో 883 మంది ఓటు హక్కు ఉంది. మధ్యాహ్నం 2గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 4గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతరం వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు.