సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ప్ర‌ముఖ లిరిసిస్ట్ మాయా గోవింద్ క‌న్నుమూత

Lyricist Maya Govind Passes Away Due To Heart Attack.సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ లిరిసిస్ట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2022 5:26 AM GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ప్ర‌ముఖ లిరిసిస్ట్ మాయా గోవింద్ క‌న్నుమూత

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ లిరిసిస్ట్ మాయా గోవింద్ క‌న్నుమూశారు. గ‌త కొంత‌గా బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో ఆమె బాధ‌ప‌డుతుండ‌గా.. ముంబైలోని నివాసంలో గుండెపోటుతో గురువారం క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 82 సంవ‌త్స‌రాలు. ఈ విష‌యాన్ని ఆమె కుమారుడు అజ‌య్ మీడియాకు వెల్ల‌డించారు.

'బ్రెయిన్ క్లాట్ కావ‌డం వ‌ల్ల అమ్మ ఆరోగ్యం క్ర‌మ‌క్ర‌మంగా క్షీణించింది. ఆస్ప‌త్రిలో చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం మెరుగుప‌డ‌టంతో నెల‌న్న‌ర క్రితం ఇంటికి తీసుకొచ్చాం. అయితే.. గురువారం గుండెపోటుతో అమ్మ క‌న్నుమూసింది.' అంటూ అజ‌య్ భావోద్వేగానికి లోన‌య్యారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన మాయా గోవింద్..దివంగ‌త రైట‌ర్, డైరెక్టర్ రామ్ గోవింద్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమె 'ఆంఖో మే బేస్ హో తుమ్‌', 'మై ఖిలాడీ తూ అనారీ' ,' మోర్ ఘ‌ట‌ర్ ఆయే స‌జ‌న్‌వా', 'గుటుర్ గుటుర్' లాంటి పాపుల‌ర్ పాట‌ల‌ను రాశారు. సుమారు 350 చిత్రాల‌కు ప‌ని చేసి 800 కు పైగా పాట‌లు రాశారు. ఆమె లిరిసిస్ట్ మాత్ర‌మే కాకుండా క‌వి, ఓ థియేట‌ర్ ఆర్టిస్ట్ కూడాను. 1970లో ప్రసిద్ధ రంగస్థల నాటకం 'ఖామోష్‌'లో 'వెనారే బాయి'గా ఆమె న‌ట‌న‌కు గానూ 1970లో సంగీత నాటక అకాడమీ, లక్నో వారిచే "ఉత్తమ నటి" అవార్డును కూడా అందుకుంది.

కాగా.. మాయాగోవింద్ మృతిప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ‌జేశారు.

Next Story
Share it