లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ బాస్కర్ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది.

By Medi Samrat  Published on  25 Nov 2024 9:15 PM IST
లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ బాస్కర్ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్లు వసూలు చేయడం ద్వారా నటుడి కెరీర్ కు ఊపు వచ్చింది. తమిళం, మలయాళ భాషలలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక లక్కీ బాస్కర్ OTT స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ విడుదల తేదీని ప్రకటించారు.

లక్కీ బాస్కర్ నవంబర్ 28న నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో ప్రసారం కానుంది. థియేట్రికల్ రిలీజ్ లో హిట్ ఎలా అయిందో OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా అలాగే ఈ సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమా అమరన్, క తో మంచి పోటీ ఎదుర్కొంది. తెలుగు, తమిళం, మలయాళ భాషలలో బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ సాధించింది. ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ కెరీర్ లో సోలో 100 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్లు వసూలు చేసిన సీతా రామం తర్వాత టాలీవుడ్‌లో మరో సోలో హిట్‌గా నిలిచింది.

Next Story