పునీత్ సమాధి ఎదుట పెళ్లి.. అడ్డుకున్న పోలీసులు
Lovers comes to get marriage in front of Puneeth Rajkumar grave.కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని
By తోట వంశీ కుమార్ Published on 7 Nov 2021 11:18 AM ISTకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి వారం దాటినప్పటికి ఇంకా ఈ విషయాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కంఠీరవ స్టూడియోలో పునీత్ కు అంత్యక్రియలు నిర్వహించగా.. బుధవారం నుంచి ఆయన సమాధిని బుధవారం నుంచి ఆయన సమాధిని సందర్శించుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిత్యం వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఓ ప్రేమ జంట పునీత్ సమాధిని దర్శించుకునేందుకు వచ్చారు. తమ అభిమాన నటుడి సమాధి ఎదుట పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. దీంతో వారు అక్కడ ఉన్న పోలీసుల పరిష్మన్ అడుగ్గా.. అందుకు వారు నిరాకరించారు.
వివరాల్లోకి వెళితే.. బళ్లారికి చెందిన గురురాజ్, గంగా అనే జంట పునీత్‌కు వీరాభిమానులు. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శనివారం పునీత్ సమాధిని దర్శించుకున్నారు. సమాధి ముందు వివాహం చేసుకోవడానికి అక్కడి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో బాధతో అక్కడి నుంచి వెలుతూ.. మీడియాతో మాట్లాడారు. మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మా వివాహానికి అంగీకరించారు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదన్నారు. కాగా.. దీనిపై రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు స్పందించారు. పునీద్ సమాధి ముందు ప్రేమ జంటలు పెళ్లి చేసుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని.. అయితే వారి తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి అని మాత్రం చెప్పారు. పునీత్ ప్రజల ఆస్తి అని అన్నారు. దీంతో త్వరలోనే ఆ ప్రేమ జంట పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.