లవ్‌స్టోరీ టీజర్‌.. సాయి పల్లవిని తీసుకువెళ్లిపోతున్న చైతూ..!

Love Story Teaser out.ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం ల‌వ్‌స్టోరి టీజర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2021 12:11 PM IST
love story teaser

ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం ల‌వ్‌స్టోరి. అక్కినేని నాగ‌చైత‌న్య క‌థ‌నాయకుడిగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది. అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై చైతూ భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. సంక్రాంతి పండుగ‌ను పురస్క‌రించుకుని ల‌వ్‌స్టోరీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఒక నిమిషం నిడివిగ‌ల ఈ టీజ‌ర్ శేఖ‌ర్ మార్క్ స‌న్నివేశాల‌తో సాగింది. టీజర్‌లో నాగ చైతన్య మాస్‌ లుక్‌లో కనిపించాడు.

మధ్య తరగతి వెతల్ని యథావిధిగానే చూపిస్తున్నారు కమ్ముల. బుల్లి కుటుంబాలు ఆత్మీయతలు అందులో సున్నితత్వం ఇవన్నీ ఈ టీజర్ లో కనిపిస్తున్నాయి. `వదిలేస్తావా?` అని ఎంతో ఆవేదనగా సాయిపల్లవి ప్రశ్నించగానే గతుక్కుమన్న ప్రేమికుడు చై ఆ తర్వాత చేసిన పనేమిటో కన్ఫ్యూజన్ గానే ఉంది. అన్నట్టు చై ఉన్నట్టుండి సాయి పల్లవిని లాక్కెళ్లిపోతున్నాడు. అలా వీధిలో పరిగెత్తుకుని వెళుతోంది ఆ జంట. ఇంట్లో పెద్దల్ని కాదని పెళ్లికి సిద్ధమయ్యే లవ్ స్టోరీనా? అన్నది తెరపై చూడాల్సిందే. మొత్తానికి టీజ‌ర్‌తోనే శేఖ‌ర్ క‌మ్ముల భారీ అంచ‌నాలు పెంచేశాడు. చూస్తుంటే.. మ‌రో భారీ హిట్ కొట్టేలా క‌నిపిస్తున్నాడు.


Next Story