లియో ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా లియో. ఈ సినిమా కోసం తమిళ, తెలుగు సినీ అభిమానులు

By Medi Samrat  Published on  2 Oct 2023 7:09 PM IST
లియో ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా లియో. ఈ సినిమా కోసం తమిళ, తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా.. తాజాగా అందుకు సంబంధించి అధికారిక ప్రకటన ద్వారా చిత్ర యూనిట్ రివీల్ చేసింది. లియో సినిమా ట్రైలర్ అక్టోబర్ 5న రానుంది. మంచులో విజయ్ కత్తి పట్టుకుని హైనాతో పోరాడడానికి సిద్ధమైన పోస్టర్ ను వదిలారు. అందులో ట్రైలర్ వచ్చే డేట్ ను విడుదల చేశారు. అయితే ఏ టైమ్ కు వస్తుందో మాత్రం చెప్పలేదు.

2021లో 'మాస్టర్' తర్వాత మరోసారి దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి 'లియో: బ్లడీ స్వీట్' లో విజయ్ నటిస్తున్నారు. భారతదేశంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇంకా తెరవలేదు.. అయితే ఈ చిత్రం అక్టోబర్ 19 న విడుదల కానుంది. విదేశాలలో మాత్రం సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో, లియో అడ్వాన్స్ బుకింగ్‌లను తెరిచారు. అయితే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ కు సంబంధించి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.

లియో సినిమా విడుదలకు ఇంకా 17 రోజుల సమయం ఉంది. ఇది ఇప్పటికే 2,73,170 పౌండ్‌లను వసూలు చేసింది. UKలో భారతీయ చిత్రానికి మూడవ అత్యధిక ఓపెనింగ్ రోజుగా నిలిచింది. సుల్తాన్, చెన్నై ఎక్స్‌ప్రెస్, రేస్ 3 వంటి చిత్రాలను బీట్ చేసి ఈ స్థానానికి చేరుకుంది. షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్ సినిమాలకు 3,07,000 పౌండ్లు, 3,19,000 పౌండ్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. రాబోయే 17 రోజుల్లో ఈ రికార్డును లియో సినిమా దాటేస్తుందని భావిస్తున్నారు.

Next Story