కేక పుట్టిస్తోన్న 'లైగర్‌' ఫస్ట్ సాంగ్ ప్రోమో

Liger first song promo out. టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ 'లైగర్'. ఈ సినిమాకు

By అంజి  Published on  8 July 2022 5:29 PM IST
కేక పుట్టిస్తోన్న లైగర్‌ ఫస్ట్ సాంగ్ ప్రోమో

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ 'లైగర్'. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. కరణ్ జోహర్, చార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే లైగర్ టీమ్‌ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. 'అక్డీ పక్డీ' అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రవి కుమార్ రచించగా, అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించారు.

ఈ మాస్​ సాంగ్​ ప్రోమో మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. విజయ్‌ దేవర కొండ, అనన్య పాండే స్టెప్పులు మాస్‌ ప్రేక్షకులకు కేక పెట్టిస్తున్నాయి. 'అక్డీ పక్డీ' పూర్తి సాంగ్‌ను ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో తెగ లైక్స్‌, కామెంట్లు వస్తున్నాయి. సాంగ్‌ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మూవీలో విజయ్ మార్షల్ ఆర్ట్స్‌ ఫైటర్‌గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్‌లో స్పెషల్ ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాడు. భారీ వర్కౌట్లు చేసి సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లోకి మారాడు. దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌ ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు.


Next Story