లియో ట్రైలర్.. యాక్షన్ మామూలుగా లేదు

దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా 'లియో'. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

By Medi Samrat  Published on  5 Oct 2023 7:20 PM IST
లియో ట్రైలర్.. యాక్షన్ మామూలుగా లేదు

దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా 'లియో'. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి. ఓ నేర సామ్రాజ్యానికి.. ఓ కేఫ్ యజమానికి మొదలైన గొడవను ట్రైలర్ లో చూపించారు. ఈ లియో ఎవరు.. అతడిని చంపడానికి ప్రయత్నిస్తోంది ఎవరనేది సినిమాలో చూడాలి. ఒకప్పుడు కోలీవుడ్ లో హిట్ పెయిర్ గా నిలిచారు విజయ్-త్రిష. ఈ సినిమాలో కూడా ఈ కాంబినేషన్ ను రిపీట్ చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. గౌతమ్ వాసుదేవ్ మీనన్, యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ ను కూడా ట్రైలర్ లో చూపించారు.


విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన 'మాస్టర్' బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఆ తరువాత వస్తున్న 'లియో' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక లోకేష్ కనకరాజ్ చేస్తున్న సినిమాలతో ఒకదానికొకటి లింక్ ఉందని చెబుతూ ఉన్నారు. దీంతో ఏ సినిమాలో ఏ స్టార్ కనిపిస్తారో.. అనే క్యూరియాసిటీ కూడా సినీ జనాల్లో ఎక్కువైంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మించాడు. ఈ నెల 19వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story