ప‌వ‌న్-క్రిష్ సినిమా.. షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫోటోలు.. వైర‌ల్‌

Leaked pic Pawan Kalyan from the sets of PSPK27.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత వ‌రుస సినిమాల‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2021 8:11 AM IST
ప‌వ‌న్-క్రిష్ సినిమా.. షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫోటోలు.. వైర‌ల్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత వ‌రుస సినిమాల‌తో దూసుకెలుతున్నాడు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వ‌కుండా అటు రాజ‌కీయాలు, ఇటు సినిమా షూటింగ్స్‌తో పుల్ బిజీగా ఉన్నారు. పింక్ రీమేక్ వ‌కీల్ సాబ్ షూటింగ్‌ను ఇప్ప‌టికే పూర్తి చేసిన ప‌వ‌న్.. మ‌ళ‌యాళ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌య్ సినిమా తెలుగు రీమేక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ద‌గ్గుపాటి రానా కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంతో పాటుగా పవన్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్ న‌టిస్తున్నారు. ఇది పవన్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మొగలాయిలా కాలంనాటి కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ స్పాట్ నుంచి ప‌వ‌న్ పిక్స్ లీక్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మహాశివరాతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో చిత్రబృందం ఉంది.


Next Story