నంద‌మూరి అభిమానులకు శుభ‌వార్త‌.. బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం.!

Latest update on Balayya son Mokshagna entry.నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓ శుభ‌వార్త‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jan 2021 4:55 AM GMT
నంద‌మూరి అభిమానులకు శుభ‌వార్త‌.. బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం.!

నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓ శుభ‌వార్త‌.. అతి త్వ‌ర‌లోనే రానుంది. బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లే క‌నిపిస్తోంది. ఎప్పటి నుంచో ఈ వార్త కోసం నందమూరి అభిమానులు కాచుకుని కూర్చున్నారు. అయితే.. ఈ సినిమాకు ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు..? అన్న ప్ర‌శ్న ఉండేది. మోక్ష‌జ్ఞ ఎంట్రీపై బాలయ్యని అడిగితే.. 'పక్కాగా ప్లాన్‌ చేస్తున్నాం.. స్ర్కిప్ట్‌లు రెడీ చేయిస్తున్నాను.. ఒక్కొక్కటిగా వదులుతాం' అంటున్నారే కానీ.. ఎప్పుడు వారసుడి ఎంట్రీ అనేది మాత్రం చెప్పడం లేదు.

అయితే.. మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఈ ఏడాది జూన్‌లో ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. బాలయ్య పుట్టిన రోజైన 10న మోక్షజ్ఞ సినిమాని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని.. ఈ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. మోక్షజ్ఞ కోసం పూరీ ఓ స్టోరీ రెడీ చేశాడని.. బాలయ్యకి ఆ స్టోరీ వినిపించ‌గా.. అందుకు ఆయ‌న కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. మోక్షజ్ఞ మొదటి సినిమానే పాన్‌ ఇండియా లెవల్‌లో ఉండనుందట. మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాధ్‌కే బాలయ్య తనయుడిని కూడా పరిచయం చేసే అవకాశం లభించిందని, ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో చేస్తున్న 'లైగర్‌' తర్వాత పూరీ ఈ చిత్రమే చేయనున్నారని ఇండస్ట్రీలో వార్తలు నడుస్తున్నాయి.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌.. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీపై వ‌స్తున్న వార్త‌ల‌పై బాలయ్య ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మ‌రీ.
Next Story