లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్

Lata Mangeshkar Health Update. దాదాపు మూడు వారాలుగా కోవిడ్ -19, న్యుమోనియాతో పోరాడుతున్న లతా మంగేష్కర్ ఆరోగ్యం స్వల్పంగా

By అంజి  Published on  30 Jan 2022 9:00 PM IST
లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్

దాదాపు మూడు వారాలుగా కోవిడ్ -19, న్యుమోనియాతో పోరాడుతున్న లతా మంగేష్కర్ ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడుతోంది. శనివారం నాడు లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని అనేక మీడియా సంస్థలు నివేదించాయి. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్ మరో అప్‌డేట్ అందించారు. లతా మంగేష్కర్ స్పృహలో ఉన్నారని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ ప్రతీత్ సమదానీ తెలిపారు. "లతా మంగేష్కర్ ICU లోనే ఉన్నారు. ఆమె ప్రస్తుతం వెంటిలేటర్ పై లేరు. ఆమె ప్రస్తుతం స్పృహలో ఉంది. వెంటనే విడుదల చేయడం సాధ్యం కాదు." అని తెలిపారు.

లతా మంగేష్కర్ ఆరోగ్యం కోసం అభిమానులు ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె పట్ల తమ ప్రేమను తెలియజేస్తున్నారు. గాయని సన్నిహితురాలు అనూషా శ్రీనివాసన్ మాట్లాడుతూ "ఆమె ఆరోగ్యంలో మెరుగుదల సంకేతాలను చూపుతోంది, అయితే డాక్టర్ ప్రతీత్ సమదానీ నేతృత్వంలోని వైద్యుల బృందం పరిశీలనలో ఉంటుంది. మీ ప్రార్థనలకు ధన్యవాదాలు" అని తెలిపారు. అయోధ్యలో లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడాలని ఇటీవల యాగాలు నిర్వహించబడ్డాయి. లతా మంగేష్కర్ మెరుగైన ఆరోగ్యం కోసం 'మహామృత్యుంజయ్ జపాన్ని' చేసారు.

Next Story