ఓటీటీలోకి రజనీకాంత్ డిజాస్టర్ సినిమా
రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 4 April 2024 3:47 PM ISTరజనీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీ అతిధి పాత్రలో కనిపించారు. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి A. R. రెహమాన్ సంగీతం కూడా అందించారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటించారు. రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. కథానాయకుడు తర్వాత రజనీకాంత్ అతిధి పాత్ర చేసిన సినిమా ఇది. ఈ చిత్రం చూసి అభిమానులు కూడా నిరాశ చెందారు. రజనీకాంత్ కు సంబంధించిన సన్నివేశాలను తీసివేయడం.. స్క్రిప్ట్ లో మార్పులు చేయడం వంటి అనేక కారణాల వల్ల సినిమా పరాజయానికి కారణమని దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ అన్నారు. ఈ డిజాస్టర్ సినిమా OTTలోకి రావడానికి చాలా రోజులే పట్టింది. ఈ సినిమా ఏప్రిల్ 15 నుండి Sun NXTలో ప్రసారం కానుంది. కనీసం ఓటీటీలో అయినా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.
రజనీకాంత్ ప్రస్తుతం వెట్టైయాన్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇటీవలే విడుదలైంది. లాల్ సలామ్ ప్రభావం నుంచి బయటపడాలంటే రజనీకాంత్ ఈ సినిమాలతో సక్సెస్ కొట్టాల్సిందే.