గుంటూరు కారం: కుర్చీ మడతపెట్టి ప్రోమో మాములుగా లేదుగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. తాజాగా ఈ మూవీ నుంచి ఫ్యాన్స్‌కు కిక్కెక్కించే అప్‌డేట్ వచ్చింది.
By అంజి Published on 29 Dec 2023 11:57 AM ISTగుంటూరు కారం: కుర్చీ మడతపెట్టి ప్రోమో మాములుగా లేదుగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. తాజాగా ఈ మూవీ నుంచి ఫ్యాన్స్‌కు కిక్కెక్కించే అప్‌డేట్ వచ్చింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. జనవరి 12, 2024 న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్‌గా మేకర్స్ ఈ మూవీ నుండి 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో మహేష్ బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ మాస్ సాంగ్ ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగిస్తోంది.
దీనికి సంబంధించిన పూర్తి సాంగ్ రేపు రిలీజ్ కానుంది. ఈ సాంగ్‌కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా, థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వీరిద్దరి కెరియర్ లో ఇదే స్టార్ హీరో మూవీ కావడం విశేషం. ఈ సినిమా కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 6వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Hyping up your new year!! Here's the promo of #KurchiMadathapetti#TrivikramSrinivas @MusicThaman @sreeleela14 @Meenakshiioffl #RamajogayyaSastry @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th pic.twitter.com/tP9HPN8TvA
— Mahesh Babu (@urstrulyMahesh) December 29, 2023