కృష్ణం రాజు మ‌ర‌ణం తెలుగు వెండితెరకు తీరని లోటు : సీఎం కేసీఆర్‌

Krishnam Raju passes away celebrities condolences.రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు క‌న్నుమూశారు. ఆయ‌న మృతి ప‌ట్ల సినీ, రాజ‌కీయ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sept 2022 9:10 AM IST
కృష్ణం రాజు మ‌ర‌ణం తెలుగు వెండితెరకు తీరని లోటు : సీఎం కేసీఆర్‌

సీనియ‌ర్ న‌టుడు, రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నారు.

న‌టుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. త‌న 50 ఏళ్ల సినీ ప్ర‌స్థానంలో అనేక చిత్రాల్లో కృష్ణంరాజు హీరోగా న‌టించి విల‌క్ష‌ణ న‌ట‌నాశైలితో రెబ‌ల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నార‌ని గుర్తు చేసుకున్నారు. కృష్ణం రాజు మ‌ర‌ణం వెండి తెర‌కు తీర‌ని లోట‌ని అన్నారు. లోక్ స‌భ స‌భ్యునిగా, కేంద్ర మంత్రిగానూ సేవ‌లందించిన కృష్ణంరాజు మృతి విచార‌క‌ర‌మ‌న్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కేసీఆర్ ఆకాంక్షించారు.

"ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇక లేరన్న వార్త దిగ్భ్రాతి కలిగించింది. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను."- రేవంత్ రెడ్డి

"ఉభయగోదావరి జిల్లా నుండి బీజేపీ పార్టీ త‌రుపున కేంద్ర మంత్రిగా సేవ‌లందించిన పెద్ద‌లు, మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు కృష్ణంరాజు మ‌ర‌ణం దిగ్భ్రాంతిని క‌లిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." - బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు





Next Story