గని నుంచి 'కొడ్తే' వీడియో సాంగ్.. తమన్నా డ్యాన్స్ అదిరిపోయింది
Kodthe Video song From Ghani Movie Release.మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటించిన చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం
By తోట వంశీ కుమార్ Published on
24 March 2022 8:08 AM GMT

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటించిన చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నదియా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమా పైన అంచాలను భారీగా పెంచగా.. తాజాగా 'కోడ్తే' అంటూ సాగే స్పెషల్ సాంగ్ వీడియోని విడుదల చేసింది. ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా చిందులు వేసింది. తమన్నా డ్యాన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను హారికా నారాయణ్ పాడారు. థమన్ సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story