కిరణ్ అబ్బవరం సినిమా ఓటీటీలో విడుదలకు ముహూర్తం ఖరారు

Kiran Abbavarams Meter Movie Ott Date Lock. యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు.

By M.S.R  Published on  29 April 2023 7:30 PM IST
కిరణ్ అబ్బవరం సినిమా ఓటీటీలో విడుదలకు ముహూర్తం ఖరారు

యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. కొన్ని కొత్త తరహా సినిమాలు.. ఇంకొన్ని రొటీన్ సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు కిరణ్ అబ్బవరం. కొద్దిరోజుల కిందట 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ హిట్ వచ్చిన కొద్దిరోజులకే 'మీటర్' సినిమా రాగా.. కనీసం ఒక్క వారం కూడా థియేటర్లలో సందడి చేయలేకపోయింది. డైరెక్టర్ రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇటీవలే ఆడియన్స్ ముందుకు వచ్చింది. త్వరలో ఈ మూవీ ఓటీటీలో సందడి చేయబోతోంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే మీటర్ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి రాబోతుంది. కిరణ్ సరసన అతుల్య రవి నటించింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. రొటీన్ సినిమా థియేటర్లలో గొప్పగా సందడి చేయకపోయినా.. హోమ్ థియేటర్లలో ఆకట్టుకుంటుందేమో చూడాలి.


Next Story