తండ్రి కాబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఫొటో షేర్‌ చేసిన హీరో

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రి కాబోతున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని చెబుతూ మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

By Knakam Karthik
Published on : 21 Jan 2025 7:52 AM

తండ్రి కాబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఫొటో షేర్‌ చేసిన హీరో

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రి కాబోతున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని చెబుతూ మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన భార్య రహస్యతో దిగిన ప్రత్యేక చిత్రాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. మా ప్రేమ పెరుగుతోంది అని ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు. ఈ సంతోషకరమైన సమయంలో అందరి ఆశీస్సులు తమకు ఉండాలని కోరుకున్నారు. దీనిపై స్పందిస్తోన్న నెటిజన్లు.. కిరణ్, రహస్య దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రాజావారు.. రాణిగారు మూవీతో తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం... అందులోనే హీరోయిన్‌గా నటించిన రహస్యను గతేడాది వివాహం చేసుకున్నారు. ఆ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం, తర్వాత ప్రేమగా మారింది. గతేడాది ఆగస్గులో వీరద్దరూ వివాహ బందంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది గెస్ట్‌ల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగింది.

ఇక సినిమాల టాపిక్‌కి వస్తే.. ఇటీవల 'క' మూవీతో కిరణ్ అబ్బవరం సూబర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. లేటెస్ట్‌గా నటిస్తోన్న దిల్ రూబా మూవీ కూడా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story