కిరణ్ అబ్బవరం మూవీకి అరుదైన గౌరవం
తెలుగు మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం అరుదైన గౌరవాన్ని పొందారు.
By Knakam Karthik
కిరణ్ అబ్బవరం నటించిన మూవీకి అరుదైన గౌరవం
తెలుగు మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం అరుదైన గౌరవాన్ని పొందారు. తాను ప్రధాన పాత్రలో నటించిన 'క'(KA) మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్'లో ఉత్తమ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా బృందానికి నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు కొత్త దర్శకులు సుజిత్, సందీప్‌లు సంయుక్తంగా తెరకెక్కించారు. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. గతేడాది (2024) విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా 'క' ప్రేక్షకులను అలరించింది.
కిరణ్ అబ్సవరం కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచి మంచి వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకి పైగా మైల్ స్టోన్ మార్క్ ను టచ్ చేసింది. దాంతో పార్ట్ 1 విజయం సాధించడంతో పార్ట్ 2ను మరింత ఉత్కంఠగా తెరకెక్కిస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మరోవైపు ఇప్పటికి 'క' చిత్రం అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది. డాల్బీ విజన్ 40, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థియేటర్ల కొరత కారణంగా మొదట తెలుగులో మాత్రమే విడుదలైంది. అయినప్పటి ఈ చిత్రం ఆడియన్స్ నుంచి విశేష స్పందన అందుకుని పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టింది. తాజాగా అరుదైన ఘనతను దక్కించుకుంది.