కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్తానీ ఉగ్రవాది కాల్పులు

హాస్యనటుడు, నటుడు కపిల్ శర్మకు చెందిన కేఫ్‌పై దాడి జరిగింది.

By Knakam Karthik
Published on : 11 July 2025 8:13 AM IST

Cinema News, Bollywood, Comedian Kapil Sharma, Kapil Sharmas Kaps Cafe

కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్తానీ ఉగ్రవాది కాల్పులు

హాస్యనటుడు, నటుడు కపిల్ శర్మకు చెందిన కేఫ్‌పై దాడి జరిగింది. బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఇటీవల ప్రారంభించిన 'కాప్స్ కేఫ్'పై గురువారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పులకు తానే బాధ్యత వహిస్తున్నట్లు ఖలిస్తానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డి ప్రకటించుకున్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జాబితా చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లడ్డి, నిషేధిత గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI)తో సంబంధం కలిగి ఉన్నాడు. అయితే ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది.

ప్రొఫెషనల్ రంగంలో, కపిల్ తన ప్రసిద్ధ చాట్ షో “ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో” యొక్క మూడవ సీజన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయడంలో బిజీగా ఉన్నాడు. కపిల్‌తో పాటు, ఈ షోలో అర్చన పురాన్ సింగ్, సునీల్ గ్రోవర్, కృష్ణ అభిషేక్ , నవజ్యోత్ సింగ్ సిద్ధూ వంటి ప్రముఖ నటులు కూడా పాల్గొంటారు.

Next Story