బోట్ కోసం కీర్తి పరుగులు.. వీడియో వైర‌ల్

Keerthy suresh running boat video viral.తాజాగా కీర్తి.. ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియోలో కీర్తి సురేష్ బోట్ కోసం పరుగు పెడుతూ కనిపించింది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 28 March 2021 12:46 PM IST

Keerthy suresh running boat video viral.

'నేను శైల‌జ' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్‌. అందం, అభిన‌యంతో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ మంచి గుర్తిపు తెచ్చుకుంది. కాగా.. రెండు రోజుల క్రిత‌మే కీర్తి న‌టించిన రంగ్ దే చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంలో నితిన్‌కు జోడిగా న‌టించింది. ఇక ఈ చిత్రం షూటింగ్ స‌మ‌యం నుంచి నితిన్‌, కీర్తి లు త‌మ సోష‌ల్ మీడియాలో ఒక‌రిని మ‌రొక‌రు ఆట ప‌ట్టించుకున్న వీడియోను పోస్టు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా కీర్తి.. ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియోలో కీర్తి సురేష్ బోట్ కోసం పరుగు పెడుతూ కనిపించింది. బోట్ ఎక్కడ మిస్ అవుతుందో అని ఆపండి అంటూ అరుస్తూ కీర్తి పలుగులు పెట్టడం నవ్వు తెప్పిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది. దీనిపై కీర్తి అభిమానులు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మేడం కొంచెం నిదానంగా ప‌రిగెత్తండి.. అంటూ పోస్టులు పెడుతున్నారు. మ‌రీ ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి వీడియోపై లుక్క్ వేయండి




Next Story