'సీతారామం' సినిమాపై ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ విడుదలైంది. తాజాగా ఈ సినిమాని చూసిన 'ది కాశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాని సోషల్ మీడియా వేదికగా అభినందించారు. 'నిన్న రాత్రి నేను హను రాఘపూడి తీసిన సీతారామం చూశాను. అందులో దుల్కర్‌ని చూడటం చాలా రిఫ్రెష్‌గా అనిపించింది. చాలా ఇంప్రెస్ అయ్యాను. అది అతని నిజాయతీ నుంచి వచ్చింది. ఇక మృణాల్ గురించి ఏమని చెప్పాలి. ఆమె నటనను చూడటం ఇదే మొదటిసారి. చాలా నిజాయతీగా నటించింది. త్వరలో ఆమె పెద్ద స్టార్ అవుతుంది. అభినందనలు!' అని రాసుకొచ్చాడు.
1992లో కశ్మీర్‌లో కశ్మీరి పండిట్లపై జరిగిన దురగతాలు, అరాచకాల ఆధారంగా తెరకెక్కిన 'ది కాశ్మీరీ ఫైల్స్' చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంవవ్యాప్తంగా రూ.350కోట్ల పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఒక్కసారిగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పేరు మారు మ్రోగిపోయింది.