ప్ర‌భుత్వాన్ని క‌దిలించిన కాంతార సినిమా.. కీల‌క నిర్ణ‌యం.. వారికి ప్ర‌తి నెలా రూ.2వేలు

Karnataka Government announces monthly allowance for 'Daiva Narthakas'.కాంతార‌.. ప్ర‌స్తుతం ఈ చిత్రం రికార్డుల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Oct 2022 9:34 AM IST
ప్ర‌భుత్వాన్ని క‌దిలించిన కాంతార సినిమా.. కీల‌క నిర్ణ‌యం.. వారికి ప్ర‌తి నెలా రూ.2వేలు

కాంతార‌.. ప్ర‌స్తుతం ఈ చిత్రం రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. ఆదివాసీ సంస్కృతిని, సంప్ర‌దాయాన్ని ముఖ్యంగా భూత‌కోల నృత్య‌కారుల‌ను చూపించిన విధానం చాలా బాగుంది. భాష‌తో సంబంధం లేకుండా విడుద‌లైన అన్ని ప్రాంతాల్లో ప్రశంసల వర్షం కురుస్తున్న నేపథ్యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 60ఏళ్లు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్లు చెప్పింది. అర్హులైన వారందరికీ నెలకు రూ.2000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

బెంగ‌ళూరు సెంట్ర‌ల్ ఎంపీ పీసీ మోహ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. హిందూ ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యేక దైవారాధనగా ఉందని అన్నారు. దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి బీజేపీ ప్రభుత్వం ప్రతి నెలా రూ.2000 అలవెన్స్‌ అందిస్తుంది. ఇందుకు అంగీకరించిన సీఎం బస్వరాజ్‌ బొమ్మెకి, మంత్రి సునీల్‌ కుమార్‌ కాకర్లకు ధన్యవాదాలని ఎంపీ ట్వీట్ చేశారు.

రిషభ్ శెట్టి నటించడమే కాకుండా స్వీయ దర్శకత్వం వహించిన కాంతార చిత్రం క‌లెక్షన్‌ల పరంగానూ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార సినిమా.. ఇప్పటి వరకు రూ.150 కోట్లకి పైగా కలెక్షన్‌లు సాధించింది. ఇక తెలుగులో దాదాపు రూ. 25 కోట్లు వసూళ్లు చేసిన‌ట్లు తెలుస్తోంది. తమిళం, మలయాళం వర్షన్లోనూ మంచి వసూళ్లే సాధిస్తుండ‌గా.. బాలీవుడ్‌లో దూసుకుపోతుంది. శుక్ర‌వారం విడుద‌ల అవ్వ‌గా ఆ రోజు రూ.1.27 కోట్లు కలెక్ట్‌ చేసింది. శనివారం రూ.2.75 కోట్లు, ఆదివారం 3.50కోట్లు, సోమవారం 1.75కోట్లు, మంగళవారం 1.88 కోట్లు, బుధవారం రూ.1. 95కోట్లు సాధించింది. ఇప్పటివరకూ రూ.13.10కోట్లు వసూలు చేసింది.

Next Story