దేవరతో చేతులు కలిపిన కరణ్ జోహార్.. అక్కడ కూడా భారీ రిలీజ్ పక్కా.!

దేవర: పార్ట్ 1 చిత్రాన్ని భారీగా విడుదల చేయడానికి ఆ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

By Medi Samrat  Published on  10 April 2024 5:00 PM IST
దేవరతో చేతులు కలిపిన కరణ్ జోహార్.. అక్కడ కూడా భారీ రిలీజ్ పక్కా.!

దేవర: పార్ట్ 1 చిత్రాన్ని భారీగా విడుదల చేయడానికి ఆ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ దక్షిణ భారతదేశం అంతటా సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తూ ఉండగా.. ఇక కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌తో ఇప్పుడు చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని ఉత్తరాదిలో పంపిణీ చేయనున్నారు. కరణ్ జోహార్ చేతులు కలిపితే భారీగా రిలీజ్ ఉంటుందని దక్షిణాది చిత్ర నిర్మాతలకు తెలుసు.. అందుకే పలు దక్షిణాది ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ధర్మ ప్రొడక్షన్స్ తో చేతులు కలుపుతూ ఉంటాయి. దేవర: పార్ట్ 1 ను ఉత్తరాదిన విడుదల చేస్తున్నామని ధర్మ ప్రొడక్షన్స్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. జూనియర్ ఎన్టీఆర్, దేవర బృందంతో కరణ్ జోహార్ ఉన్న చిత్రం కూడా షేర్ చేశారు.

ధర్మ ప్రొడక్షన్స్ బాలీవుడ్ లో కాకుండా వేరే భాషల్లో చిత్రాలను నిర్మించనప్పటికీ.. ఈ బ్యానర్ ఉత్తరాదిలో భారీ బడ్జెట్ దక్షిణ భారతీయ చిత్రాలను పంపిణీ చేస్తోంది. బాహుబలి ఫ్రాంచైజ్, ఘాజీ ఎటాక్, 2.0 లాంటి సినిమాలను ధర్మ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున దక్షిణాదిన విడుదల చేసింది. ఇప్పుడు ఆ జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 చేరింది. RRR విడుదలైనప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా అభిమానులను ఏర్పరచుకున్నారు. ఉత్తరాదిలో ఎన్టీఆర్ చిత్రాలకు భారీ డిమాండ్ ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర పార్ట్ 1 విడుదలకు సంబంధించి భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ తెలుగులో అరంగేట్రం చేస్తోంది. సైఫ్ అలీఖాన్ దేవర లో విలన్ గా చేస్తున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తూ ఉన్నాడు. ఈ చిత్రం 10 అక్టోబర్ 2024న విడుదల కానుంది.

Next Story