ఆ నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చిన కామెడీ కింగ్

Kapil Will Take A "Short Break" From The Kapil Sharma Show. కపిల్ శర్మ.. కపిల్‌ శర్మ షోకి చిన్న విరామం ఇస్తున్నాఅని అందరికీ షాక్ ఇచ్చిన కామెడీ కింగ్.

By Medi Samrat  Published on  29 Jan 2021 9:32 AM GMT
Kapil Will Take A Short Break From The Kapil Sharma Show.

కపిల్ శర్మ.. బాలీవుడ్ లో అతడి కామెడీకి కోట్లు కురుస్తాయి. ఒకానొక దశలో అతడి చుట్టూ వివాదాలు ఉన్నా.. కెరీర్ కూడా డౌన్ అయినా కూడా తిరిగి నిలదొక్కుకోగలిగాడు. కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టి కూడా దేశానికి షాక్ ఇచ్చాడు. తాజాగా కామెడీ షో 'ది కపిల్‌ శర్మ షో' ను హోస్ట్ చేస్తూ ఉన్నాడు కపిల్. తాజాగా ఈ షో విషయంలో కపిల్ ఓ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ షోను కొన్నాళ్లపాటు వాయిదా వేయనున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ షో ప్రసారాలు నిలిచిపోనున్నాయంటూ జరుగుతున్న ప్రచారం నిజమేనని కపిల్‌ శర్మ చెప్పుకొచ్చాడు. అవును కపిల్‌ శర్మ షోకి చిన్న విరామం ఇస్తున్నా. అంతేగానీ పూర్తిగా కాదు.. ప్రస్తుత పరిస్థితుల్లో నేను నా భార్యకు తోడుగా ఉండాలి. ఎందుకంటే మా రెండో బిడ్డ త్వరలోనే ప్రపంచంలోకి రానుంది. అందుకే ఈ బ్రేక్ అని అన్నాడు. పూర్తిగా షో ముగిసిపోదని, చిన్న బ్రేక్‌ మాత్రమేనని అతడు చెప్పుకొచ్చాడు.

2018 డిసెంబరులో తన చిరకాల స్నేహితురాలు గిన్నీ చరాత్‌ను కపిల్‌ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు 2019లో కుమార్తె అనైరా శర్మ జన్మించింది. కపిల్ శర్మ ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా బాలీవుడ్ నటులతో అతడి కామెడీ టైమింగ్.. షోలో పూయించే నవ్వులు.. కపిల్ కామెడీని కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉండడంతో అతడికి భారీ ఫాలోయింగ్ వచ్చింది.


Next Story