ఆత్మహత్య చేసుకున్న నటుడు సంపత్

Kannada TV actor Sampath J Ram found dead at Nelamangala residence. కన్నడ టీవీ నటుడు సంపత్ జె రామ్ చనిపోయారు.

By M.S.R
Published on : 23 April 2023 7:34 PM IST

ఆత్మహత్య చేసుకున్న నటుడు సంపత్

Kannada TV actor Sampath J Ram


కన్నడ టీవీ నటుడు సంపత్ జె రామ్ చనిపోయారు. బెంగళూరు రూరల్ జిల్లా నేలమంగళలోని తన నివాసంలో ఏప్రిల్ 22, శనివారం నాడు శవమై కనిపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని వయసు 35 సంవత్సరాలు. మీడియా నివేదికల ప్రకారం అతను ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

నటుడి మరణ వార్త కన్నడ పరిశ్రమను షాక్ కు గురి చేసింది. టీవీ సీరియల్స్, కొన్ని చలన చిత్రాలలో మంచి పాత్రలు చేసి మెప్పించాడు సంపత్. ఇంకొన్ని మంచి ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నాడని నటుడు విజయ్ సూర్య తెలిపాడు. చాలా మంచి వ్యక్తి సంపత్ అని.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాన్ని మేము నమ్మలేకపోతున్నామని మరొక సహనటుడు రాజేష్ ధృవ తెలిపారు. దివంగత నటుడి భౌతికకాయాన్ని నేలమంగళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచారు. అంతిమ సంస్కారాల కోసం అతని స్వగ్రామమైన ఎన్ఆర్ పురాకు తరలించనున్నారు.


Next Story