పునీత్ కళ్ళతో నలుగురి జీవితాల్లో వెలుగులు
Kannada superstar Puneeth Rajkumar’s eyes give sight to four youths. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఇటీవలే మరణించారు. ఆయన మరణాన్
By M.S.R
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఇటీవలే మరణించారు. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చేసిన దానాలు, మంచి పనుల గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఆయన తన కళ్లను కూడా దానం చేశారు. చనిపోయిన తర్వాత కూడా పునీత్ రాజ్ కుమార్ నలుగురిలో బతికే ఉన్నారు. ఆయన కళ్ళు ఇంకా ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాయి. పునీత్ తన కళ్ళు దానం చేశారు. ఆయన మరణం తర్వాత ళ్ళను శరీరం నుండి సేకరించి బెంగుళూరులోని నారాయణ నేత్రాలయ లో భద్రపరిచారు. ఆ కళ్లను శనివారం నలుగురు యువకులకు అమర్చినట్టు నేత్రాలయ చైర్మన్ డాక్టర్ భుజంగశెట్టి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను పై పొర, లోపలి పొర అని రెండు భాగాలుగా విభజించి ఆ పొరలు అవసరం ఉన్న నలుగురిలో అమర్చామని తెలిపారు. చనిపోయాక కూడా పునీత్ తన కళ్ళ ద్వారా నలుగురి జీవితాలలో వెలుగు నింపారు.
అక్టోబరు 29న మరణించిన తర్వాత పునీత్ రాజ్‌కుమార్ కళ్లు దానం చేశారు. ముగ్గురు పురుషులు మరియు ఒక స్త్రీకి గత రెండు రోజులలో నారాయణ నేత్రాలయలో కంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. 2006లో డాక్టర్ రాజ్‌కుమార్, 2017లో పునీత్ తల్లి పార్వతమ్మ మరణించిన తర్వాత వారి కళ్ళను కూడా దానం చేశారు. పునీత్ చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు రాఘవేంద్ర నటుడి కళ్లను సేకరించడానికి నారాయణ నేత్రాలయ నిర్వహిస్తున్న డాక్టర్ రాజ్‌కుమార్ ఐ బ్యాంక్‌కి కాల్ చేశాడు. నారాయణ నేత్రాలయ ఛైర్మన్ డాక్టర్ భుజంగ్ శెట్టి మాట్లాడుతూ పునీత్ కళ్ళను ఉంచిన వాళ్లు 20-30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారేనని ఐదుగురు వైద్యులతో కూడిన బృందం ఈ ఆపరేషన్ ను చేసింది.