విషాదం.. ప్రముఖ నటి అపర్ణ కన్నుమూత
ప్రముఖ కన్నడ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మాజీ రేడియో జాకీ అపర్ణా వస్తారే గురువారం రాత్రి మరణించినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 12 July 2024 10:00 AM ISTవిషాదం.. ప్రముఖ నటి అపర్ణ కన్నుమూత
ప్రముఖ కన్నడ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మాజీ రేడియో జాకీ అపర్ణా వస్తారే గురువారం రాత్రి మరణించినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. 57 ఏళ్ల కన్నడ నటి గత రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్నారని ఆమె భర్త నాగరాజ్ వస్తరే తెలిపారు. డీడీ చందనలో వ్యాఖ్యాతగా, అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వివిధ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పనిచేసినందుకు ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె కన్నడలో పరిపూర్ణ డిక్షన్ కారణంగా బలమైన అభిమానులను కలిగి ఉన్నారు. 1998లో దీపావళి వేడుకల్లో భాగంగా ఏకంగా ఎనిమిది గంటల పాటు షోలు ప్రదర్శించి రికార్డు సృష్టించింది. ఆమె 1984లో పుట్టన్న కనగల్ చివరి చిత్రం 'మసనాడ హూవు'తో సినీ రంగ ప్రవేశం చేసింది. అనేక కన్నడ టీవీ షోలలో నటించింది.
బెంగళూరు మెట్రో ప్రకటనల్లో వచ్చే వాయిస్ కూడా అపర్ణ వస్తారేది. ఆమె కన్నడ రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్‌లో కనిపించింది. పాపులర్ కామెడీ షో 'మజా టాకీస్'లో ఆమె 'వరలక్ష్మి' పాత్ర ప్రజలచే ప్రశంసించబడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పలువురు సినీ, టెలివిజన్, సాహిత్య, రాజకీయ ప్రముఖులు వస్తారే మృతికి సంతాపం తెలిపారు. ''నటి, ప్రముఖ వ్యాఖ్యాత అపర్ణ మరణవార్త విని విచారం వ్యక్తం చేశా. ప్రధాన కన్నడ ఛానెల్స్‌లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో కన్నడ భాషలో చాలా సొగసుగా ప్రజంట్ చేస్తూ రాష్ట్రంలోనే ఓ ఇంటి పేరుగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి మనల్ని వీడారు'' అని సిద్ధరామయ్య ఎక్స్‌లో పోస్ట్ చేశారు.