ప్రముఖ నటుడు లోహితాశ్వకు గుండెపోటు.. పరిస్థితి విషమం

kannada actor lohitashwa heart attack.. The situation is critical. శాండల్‌వుడ్ సీనియర్ నటుడు లోహితాశ్వకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని కుమారస్వామి

By అంజి
Published on : 10 Oct 2022 1:01 PM IST

ప్రముఖ నటుడు లోహితాశ్వకు గుండెపోటు.. పరిస్థితి విషమం

శాండల్‌వుడ్ సీనియర్ నటుడు లోహితాశ్వకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్‌లోని సాగర్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నటుడు లోహితాశ్వ గత రాత్రి (అక్టోబర్ 9) గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేనని డాక్టర్ తెలిపారు.

నటుడు లోహితాశ్వ 500కు పైగా సినిమాల్లో నటించారు. సినిమాల్లోనే కాకుండా నాటకాలు, రంగస్థల నాటకాలు, టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించారు. ఇంగ్లీషు ప్రొఫెసర్‌గా కూడా సేవలందించారు. 80 ఏళ్ల వృద్ధ నటుడు లోహితాశ్వ త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమకు చెందిన అభిమానులు, స్నేహితులు ప్రార్థనలు చేస్తున్నారు. నటుడు లోహితాశ్వ 1971లో వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలున్నారు. ఒక కొడుకు శరత్ లోహితాశ్వ సినిమా రంగంలో చురుగ్గా ఉన్నాడు.

500కు పైగా చిత్రాల్లో నటించిన లోహితాశ్వ గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. 2018 తర్వాత లోహితాశ్వ మళ్లీ రంగులు వేయలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోహితాశ్వ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Next Story