మీడియాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన క‌న్న‌డ న‌టుడు కిచ్చా సుదీప్‌

Kannada Actor Kichcha Sudeep says apologies to media.ఈగ చిత్రంతో తెలుగు వారికి సుప‌రిచితులైన క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2022 12:37 PM IST
మీడియాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన క‌న్న‌డ న‌టుడు కిచ్చా సుదీప్‌

'ఈగ' చిత్రంతో తెలుగు వారికి సుప‌రిచితులైన క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మీడియా ప్ర‌తినిధుల‌కు అంద‌రికి క్షమాప‌ణ‌లు చెప్పారు. అనారోగ్య కార‌ణాల‌తో ప్రెస్‌మీట్స్ అన్నింటినీ ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపారు.

"అనారోగ్యం కార‌ణంగా ప్ర‌యాణం చేయ‌లేక పోతున్నా. హైద‌రాబాద్‌, చెన్నై,కొచ్చిన్‌లో ఈరోజు జ‌ర‌గాల్సిన ప్రెస్‌మీట్స్ అన్నింటినీ ర‌ద్దు చేస్తున్నా. మీడియా మిత్రులంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా. కోలుకున్న వెంట‌నే ప్రెస్‌మీట్స్ అన్నింటీలో మ‌ళ్లీ పాల్గొంటా.త్వ‌ర‌లోనే మీ అంద‌రిని క‌లుస్తా " అంటూ సుదీర్ ట్వీట్ చేశాడు.

కాగా.. సుదీప్ తాజాగా న‌టించిన చిత్రం 'విక్రాంత్ రోణ‌'. పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల‌వుతున్న‌ ఈ చిత్రానికి అనూప్ బండారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సోషియో ఫాంట‌సీ, యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో చిత్ర బృందం వేగం పెంచింది. అందులో భాగంగా నేడు హైద‌రాబాద్, చెన్నై, కొచ్చిన్‌ల‌లో ప్రెస్‌మీట్స్‌ను నిర్వ‌హించాల‌ని బావించ‌గా.. సుదీప్ అనారోగ్యానికి గురి కావ‌డంతో వాటిని ర‌ద్దు చేశారు.

Next Story