'భారతీయుడు-2' మూవీ ఓటీటీ రైట్స్.. భారీ మొత్తానికి అమ్ముడు!
'విక్రమ్' సినిమాతో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 AD’ లో కమల్ కీ రోల్ పోషిస్తున్నారు.
By అంజి Published on 25 July 2023 1:15 PM IST'భారతీయుడు-2' మూవీ ఓటీటీ రైట్స్.. భారీ మొత్తానికి అమ్ముడు!
'విక్రమ్' సినిమాతో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 AD’ లో కమల్ కీ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్, కమల్ హాసన్ వంటి పాన్ ఇండియా నటులు నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కమల్ హాసన్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'భారతీయుడు-2' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాగా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'భారతీయుడు-2'పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శంకర్ డైరెక్షన్‌కి ఫుల్ ఫిదా అయిన కమల్.. రూ. 8 లక్షల విలువగల వాచ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఇటీవల కమల్ హాసన్ ట్వీట్ చేస్తూ.. శంకర్ డైరెక్షన్ టాలెంట్‌ని చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఈ సినిమా శంకర్ జీవితంలోనే పతాకస్థాయికి నిదర్శనమని, ఇది ఆయనను ఖచ్చితంగా టాప్‌లో నిలబెడుతుందని, గర్వపడేలా చేస్తుందని అన్నారు.
కాగా 'భారతీయుడు-2' సినిమాను విడుదల కాకముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఓటీటీ రైట్స్ కింద అన్ని లాంగ్వేజెస్‌లో రూ.200 కోట్లకు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సినిమా ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా రషెస్ చూసిన నెట్ ఫ్లిక్స్ ఈ భారీ ధరను ఆఫర్ చేసినట్టు సమాచారం. దీనిపై అటు నెట్‌ఫ్లిక్స్, ఇటు మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. ఈ సినిమాను రూ. 200 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కొని ఉంటే ఓటీటీ హక్కుల విషయంలో ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులూ బ్రేక్ అయినట్లే.
'భారతీయుడు -2' సినిమా 90 ఏళ్ల సేనాపతి అనే వృద్ధ వ్యక్తి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. 'భారతీయుడు -1' సినిమకు కంటిన్యూగా ఇది ఉంటుంది. ఎప్పుడో 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఇక ఇటీవలే 'భారతీయుడు -2' సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ అమెరికాలో వీఎఫ్‌ఎక్స్ కోసం అమెరికాలో ఉన్నాడు. ఇక ఈ మూవీలో కమల్ హాసన్ తోపాటు కాజల్, రకుల్ ప్రీత్, సిద్ధార్థ్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖనిలాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఇండియన్ 2 మూవీని నిర్మిస్తున్నాయి.