బిగ్‌బాస్ నుండి వైదొలిగిన కమల్‌హాసన్‌.. కారణం మాత్రం అదే.!

Kamal Haasan opts out of Bigg Boss Tamil. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోని బిగ్ బాస్ అల్టిమేట్ రియాలిటీ షో స్ట్రీమింగ్, అతని రాబోయే చిత్రం విక్రమ్ నిర్మాణ కార్యకలాపాల

By అంజి  Published on  21 Feb 2022 5:22 AM GMT
బిగ్‌బాస్ నుండి వైదొలిగిన కమల్‌హాసన్‌.. కారణం మాత్రం అదే.!

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోని బిగ్ బాస్ అల్టిమేట్ రియాలిటీ షో స్ట్రీమింగ్, అతని రాబోయే చిత్రం విక్రమ్ నిర్మాణ కార్యకలాపాల మధ్య షెడ్యూల్‌ కుదరపోవడంతో.. తాను బిగ్‌ బాస్‌ షో నుండి వైదొలుగుతున్నట్లు నటుడు కమల్ హాసన్ ఆదివారం ప్రకటించారు. సినీ పరిశ్రమలోని ప్రముఖ తారలు, సాంకేతిక నిపుణుల కలయికలో వచ్చే సన్నివేశాలు పూర్తి కావడానికి మరికొన్ని రోజుల షూటింగ్ మిగిలి ఉన్నందున విక్రమ్ సినిమా షూటింగ్‌, బిగ్ బాస్ అల్టిమేట్ రెండింటినీ కలిసి నిర్వహించడం అతనికి అసాధ్యంగా మారింది. దీంతో కమల్‌ హాసన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫిబ్రవరి 20 తర్వాత తాను షో యొక్క ఎపిసోడ్‌ల నుండి వైదొలుగుతున్నట్లు కమల్‌ హాసన్ చెప్పారు. అయితే, ఇప్పుడు రెండు ప్రాజెక్టులను ఏకకాలంలో నిర్వహించడం "ఆచరణాత్మకంగా అసాధ్యం" అని ఆయన అన్నారు. తమిళ బిగ్ బాస్ డిజిటల్ అవతార్‌ను ప్రారంభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని కమల్ హాసన్ అన్నారు. రియాలిటీ షోతో తాను "అటాచ్డ్" అయ్యానని నటుడు చెప్పాడు. 'విక్రమ్‌' సినిమాలో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్‌ చేసుకోనున్నారు కమల్‌హాసన్‌.

Next Story
Share it