లోకనాయకుడు కమల్ హాసన్ నాలుగేళ్ల తరువాత 'విక్రమ్' చిత్రంతో వెండితెరపై సందడి చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్‌హాసన్.. తన తదుపరి చిత్రాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తుండగా విలేకరి 'ఇండియన్-2( భారతీయుడు2)' చిత్రం గురించి స్పందించాలని కోరాడు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని భారీ బడ్జెట్‌తో లైకా సంస్థ నిర్మిస్తోండగా, కొన్ని కారణాల వల్ల చిత్ర షూటింగ్ ఆగిపోయింది. దీనిపై కమల్ మాట్లాడుతూ.. 'ఇండియన్-2' ప్రాజెక్ట్ ఆగిపోలేదన్నాడు. తప్పకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పాడు. కరోనా మహమ్మారి, సెట్‌లో ప్రమాదం ఇలా చిత్రీకరణ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.
'అయినప్పటికీ షూటింగ్‌ను ఆపలేదు. కంటిన్యూ చేశాం. ఈ సినిమాను నిర్మిస్తున్న లైకా వాళ్లతో ఇప్పటికే మాట్లాడాం. వాళ్లు కూడా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బావిస్తున్నారు. ఇంకో 40 శాతం షూటింగ్ మిగిలి ఉంది. వీలైనంత త్వరగా దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఒకే చిత్రంపై పదేళ్లు పని చేయలేం కదా. రాజ్ కమల్ ఫిల్మ్స్ అని నాకొక నిర్మాణ సంస్థ ఉంది. అలాగే శంకర్‌కి ఎస్. ప్రొడక్షన్స్ ఉంది. ఈ రెండు చాలా పెద్ద సంస్థలు. ఈ రెండింటిని మేమే పోషించాలి. అందుకోసం మేం బయటకు వెళ్లి పనిచేయాలి' అని కమల్ హాసన్ అన్నారు.