ప్రభాస్ సినిమా కోసం.. కమల్ హాసన్ ఆ రేంజి పారితోషికం తీసుకుంటున్నారా?

Kamal Haasan Charges RS 100 Cr Playing Antagonist Prabhas Starrer. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ సినిమాల లైనప్ భారీగా ఉంది.

By Medi Samrat  Published on  16 Jun 2023 6:25 PM IST
ప్రభాస్ సినిమా కోసం.. కమల్ హాసన్ ఆ రేంజి పారితోషికం తీసుకుంటున్నారా?

ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ సినిమాల లైనప్ భారీగా ఉంది. దక్షిణాది దర్శకులే కావడంతో అభిమానులు కూడా కాస్త హ్యాపీగా ఉన్నారు. ప్రభాస్ సినిమాల లైనప్ లో ప్రాజెక్ట్-కె సినిమా కూడా ఉంది. ఈ సినిమాలో దిగ్గజ నటుడు కమల్ హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారనే చర్చ నడుస్తూ ఉంది. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ -కెలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రభాస్‌తో తలపడడం దాదాపు కన్ఫర్మ్ అని చెబుతూ ఉన్నారు. ఈ స్టార్ లైనప్ ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇది అతిపెద్ద పాన్-ఇండియా ప్రాజెక్ట్ కానుంది. ఈ సినిమాలో కమల్ హాసన్‌ రోల్ కి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమా కోసం కమల్ హాసన్ 100 కోట్ల రూపాయలను కోట్ చేశారని అంటున్నారు. ఆయన చెప్పిన పారితోషకం ఇవ్వడానికి మేకర్స్ కూడా అంగీకరించారని అంటున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రాజెక్ట్- K జనవరి 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్ ఈ సినిమా సెట్స్‌లో ప్రమాదానికి గురికావడంతో సినిమా కొద్దిరోజుల పాటూ ఆపేశారనే చర్చ కూడా సాగింది. ఇక ఈ సినిమా షూట్‌ను తిరిగి ప్రారంభించాలని.. అనుకున్న టైమ్ కు సిద్ధం చేయాలని భావిస్తూ ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించనున్నారు. కమల్ హాసన్ ఈ చిత్రంలో భాగం అయితే మాత్రం దక్షిణాదిన భారీగా వసూళ్లు వస్తాయి. అమితాబ్, దీపిక పదుకోన్ కారణంగా నార్త్ ఇండియాలో కూడా మూవీపై భారీ అంచనాలు ఉండనున్నాయి.


Next Story