'బింబిసార' మూడో సింగిల్‌.. మనసుకు హత్తుకుంటోంది.!

Kalyan ram bimbisara 3rd single released. నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. ఈ మూవీకి మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి

By అంజి  Published on  2 Aug 2022 10:49 AM IST
బింబిసార మూడో సింగిల్‌.. మనసుకు హత్తుకుంటోంది.!

నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. ఈ మూవీకి మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇటీవలే రిలీజ్‌ మూవీ ట్రైలర్‌ భారీ అంచనాలను క్రియేట్‌ చేసింది. ఫాంటసీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టు 5న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్రయూనిట్‌ వరుస్‌ అప్‌డేట్‌లో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజగా మేకర్స్‌ ఈ మూవీలోని 3వ సింగిల్‌ను రిలీజ్‌ చేశారు.

'నీతో ఉంటే చాలు' అంటూ సాగే ఎమోష‌న‌ల్ సాంగ్‌ మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. కీర‌వాణి స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌కు త‌నే సాహిత్యం అందించాడు. ఈ పాట ప్రేక్షకులను హత్తుకుంటోంది. ఈ పాటను మోహ‌న భోగ‌రాజు, సండిల్యా పిస‌పాటి పాడారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడులైన అన్ని పాట‌లు చార్ట్ బ‌స్ట‌ర్లుగా మిగిలాయి. ముఖ్యంగా కీర‌వాణి పాట‌లు సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేశాయి. హీరో క‌ళ్యాణ్‌రామ్ సినిమాల ఫ‌లితం ఎలా ఉన్నా.. ప్రేక్షకుల కోసం వరుసగా సినిమాలు చేస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే బింబిసార వంటి వినూత్న సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి రెడీ అయ్యాడు. ఎన్‌టీఆర్ అర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మించాడు. కేథ‌రిన్ థెరిస్సా, సంయుక్త మీన‌న్, వారినా హుస్సేన్‌లు హీరోయిన్లుగా న‌టించారు.


Next Story