అప్పుడే ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేసేస్తున్న కల్కి
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది.
By అంజి Published on 14 Jun 2024 1:45 PM ISTఅప్పుడే ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేసేస్తున్న కల్కి
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్‌ని మరింత పెంచేసింది. విడుదలకు ముందే.. కల్కి సినిమా SS రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాను అధిగమిస్తోందని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగుండగా పలు రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయగలదని అంచనా వేస్తున్నారు.
ఈ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ప్రీమియర్ సేల్స్ ఏకంగా ఒక మిలియన్ డాలర్లను దాటేసింది. ఈ సినిమా మిలియన్ డాలర్ల ప్రీ-సేల్స్‌ను దాటింది. RRRని వేగంగా 1 మిలియన్ డాలర్ల ప్రీ-సేల్స్ సాధించిన సినిమా నిలిచింది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే కల్కి ప్రీమియర్స్ రికార్డు స్థాయిలో వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రధాన తారాగణంలో ప్రభాస్, కమల్ హాసన్‌లతో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ఇది ఈ చిత్రంపై భారీ అంచనాలను సృష్టించింది. చాలా మంది నటీనటులు అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.