మథర్స్ డే.. కొడుకును పరిచయం చేసిన కాజల్
Kajal Aggarwal shares FIRST photo of baby boy Neil Kitchlu.నటి కాజల్ అగర్వాల్ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన
By తోట వంశీ కుమార్ Published on 8 May 2022 11:41 AM ISTనటి కాజల్ అగర్వాల్ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి నీల్ కిచ్లూ అని నామకరణం చేసింది. నీల్ రాకతో కాజల్ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక.. నేడు మదర్స్ డే. ఈ రోజు కాజల్ అగర్వాల్‌కి ఎంతో ప్రత్యేకం. కాజల్ తల్లి అయిన తరువాత వచ్చిన మొదటి మదర్స్ డే ఇది. ఈ సందర్భంగా.. తన కుమారుడి ఫోటోలను తొలిసారి అభిమానులతో పంచుకుంది. అంతేకాదు.. నీల్ కోసం ఓ లేఖ కూడా రాసింది. నువ్వే నా సూర్యుడికి, చంద్రుడివి, నక్షత్రాని వి అంటూ నిన్ను పొందడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆ లేఖలో కాజల్ చెప్పుకొచ్చింది.
ప్రియమైన నీల్,
'నా మొదటి లేఖ.. నీవు నాకు ఎంత ముఖ్యమైన వాడిమో నీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. నిన్ను ఎప్పుడైతే నా చేతుల్లోకి తీసుకున్నానో, నీ చిన్ని చేతిని నా చేతితో పట్టుకుని, నీ అందమైన కళ్లనీ చూసి, నీ వెచ్చని శ్వాసని అనుభవించిన ఆ క్షణం.. నేను నీ ప్రేమలో పడిపోయాను. ఎప్పటికీ అందులోనే ఉంటాను. నువ్వు నా మొదటి సంతానం. నా తొలి కుమారుడివి. నువ్వే నా మొదటి ప్రాధాన్యం. నిజంగా.. రాబోయే సంవత్సరాల్లో, నేను నీకు నేర్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను, కానీ నీవు ఇప్పటికే నాకు ఎన్నో విషయాలు నేర్పించావు. జీవితంలో అద్భుతమైన క్షణాలు ఎలా ఉంటాయో నాకు పరిచయం చేశారు. అమ్మంటే ఏమిటో, నిస్వార్థంగా జీవించడం, స్వచ్ఛమైన ప్రేమ, శరీరం వెలుపల కూడా హృదయం ఉండటం సాధ్యమూనని నీ వల్లే నాకు తెలిసింది. ఇలాంటి ఎన్నో మధురానుభూతులను నాకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి నువ్వే అయినందుకు ధన్యవాదాలు. నువ్వు నా చిన్ని రాజకుమారుడి.
ఈ ప్రపంచాన్ని నీ వెలుగులతో నింపాలని, ఇతరుల కోసం సాయం చేయాలనే మంచి మనసుతో నువ్వు ఎదరగాలని నేను ప్రార్థిస్తున్నా.
నువ్వే నా సూర్యుడు, నా వెన్నెలవీ. నువ్వే నా చిన్ని తారవి, చిన్నా.. నువ్వు ఈ విషయాలను ఎప్పటికీ మరువకు.. అంటూ ఆ లేఖలో కాజల్ రాసుకొచ్చింది.